జమ్ముకశ్మీర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను రెండు వేర్వేరు చోట్ల పోలీసులు అరెస్టు చేశారు. బారాముల్లా జిల్లా సోపోర్ వద్ద పట్టుబడిన హిలాల్ అహ్మద్, సాహిల్ నజీర్, పీర్జాదా మహ్మద్ జహీర్‌లు..స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కశ్మీర్: ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు - Five terror suspects arrested in srinagar
జమ్ముకశ్మీర్‌లో రెండు వేర్వేరు చోట్ల ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా లష్కేరే తోయిబా ఉగ్రసంస్థకు పనిచేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
కుప్వారా బైపాస్ చెక్‌పాయింట్ వద్ద అరెస్టు చేసిన మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరి వద్ద నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : అయ్యప్ప నామస్మరణలో శబరిమల.. తెరుచుకున్న ఆలయం
Last Updated : Nov 16, 2019, 8:17 PM IST