మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా సారంగ్పుర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి - రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా సారంగ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఒక కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో చిన్నారికి గాయాలయ్యాయి. వీరు ఇండోర్ నుంచి గునాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరో కారులో మహారాష్ట్ర నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్నవూకి ఐదుగురు సాధువులు వెళ్తున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి:తమిళనాడులో మాజీ సీఎంల విగ్రహాలకు మాస్క్‌లు!
Last Updated : Jun 22, 2020, 4:37 PM IST