తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఐదుగురిని అపహరించిన చైనా ఆర్మీ - చైనా సైన్యం

అరుణాచల్ ప్రదేశ్​లో ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించిందని భాజపా ఎంపీ తపీర్ గావ్​ వెల్లడించారు. కస్తూరి జింకలను వేటాడేందుకు వెళ్లినవారిని మెక్​మోహన్​ రేఖ వద్ద పీఎల్​ఏ అపహరించిందని తెలిపారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్​ కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Chinas PLA
Chinas PLA

By

Published : Sep 5, 2020, 11:13 AM IST

Updated : Sep 5, 2020, 2:11 PM IST

చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అరుణాచల్​ప్రదేశ్​ సుబాన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించింది. సుబాన్​సిరి జిల్లాలో కస్తూరి జింకలను వేటాడేందుకు వెళ్లిన వీరిని మెక్​మోహన్​ రేఖ వద్ద చైనా సైన్యం పట్టుకుందని భాజపా ఎంపీ తపీర్ గావ్.. ఈటీవీ భారత్​తో​ తెలిపారు.

"వేటగాళ్లు ఆరుగురు వెళ్లగా.. పీఎల్​ఏ చేతికి ఐదుగురు చిక్కారు. ఒకరు తప్పించుకున్నారు. నాచోలోని వాళ్ల బంధువులతో నేను మాట్లాడాను. ఇది నిజమేనని వాళ్లు అంగీకరించారు."

- తపీర్ గావ్​

నాచో నుంచి రెజంగ్లా కనుమకు వెళ్లే ప్రాంతంలో రెండు రోజుల నడకదారిన వెళ్తే భారత్, చైనా సరిహద్దు మెక్​మోహన్ రేఖ వస్తుంది. ఇక్కడి సమీపంలో భారత భూభాగంలోనే వాళ్లను చైనా సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్​ ఎమ్మెల్యే కూడా..

మాస్కోలో భారత్‌-చైనా రక్షణమంత్రులు సమావేశం జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్‌ ఆరోపించారు. చైనా ఆర్మీ తప్పుడు విధానాలను అవలంబిస్తోందని.. ఆ దేశానికి తగిన సమాధానం ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు నిన్నాంగ్ ఎరింగ్ నేరుగా ప్రధాని కార్యాలయానికే ట్వీట్ చేశారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌, జైశంకర్‌లకు ఈ పోస్ట్‌ ట్యాగ్ చేశారు.

తమదని..

కొన్నేళ్లుగా అరుణాచల్​ప్రదేశ్​ ప్రాంతం తమదిగా చైనా వాదిస్తోంది. ఇక్కడి సరిహద్దు మెక్​మోహన్​ రేఖను చైనా గుర్తించటం లేదు. అరుణాచల్​ప్రదేశ్​ దక్షిణ టిబెట్​లోని భాగమని చెబుతోంది.

ఇదీ చూడండి:'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

Last Updated : Sep 5, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details