కేరళ పాలక్కడ్లోని చెల్లన్నమ్ గిరజన కాలనీలో విషాదం జరిగింది. ఓ వ్యక్తి అంత్యక్రియల్లో భాగంగా కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిని రామన్, అయ్యప్పన్, అరుణ్, శివన్, మూర్తిగా వలయార్ పోలీసులు గుర్తించారు. మరో తొమ్మిది మంది అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
రామన్ ఆదివారం ఉదయమే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత వరుసగా మిగతావాళ్లు మరణించటంతో పోలీసులు మృతదేహాలను పంచనామాకు తరలించారు. 'కల్తీ మద్యం సేవించినందు వల్ల మరణించారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చాం 'అని వలయార్ పోలీసులు తెలిపారు. 'ఇంకా కెమికల్ రిపోర్టు రావాల్సి ఉంద'ని వివరించారు.