జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి సైనిక బలగాలు నిర్వహించిన ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్టు రక్షణశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో పాక్ బంకర్లనూ ధ్వంసం చేసినట్టు పేర్కొంది.
పూంచ్ జిల్లాలోని మాన్‌కోట్ సెక్టర్లో భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం కాల్పులకు తెగబడింది పాకిస్థాన్. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడుల్లో.. భారత పౌరులకు ఆస్తి నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ఎదురుదాడికి దిగింది భారత సైన్యం. సుమారు 2 గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదుగురు పాక్ సైనికులను మట్టుబెట్టింది భారత ఆర్మీ.