తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు - కరోనావైరస్​ ఈశాన్య భారతం

ఈశాన్య భారతంలోని ఐదు రాష్ట్రాలు కరోనా వైరస్​ నుంచి విముక్తి పొందాయి. మొత్తం 8 రాష్ట్రాలకుగాను సిక్కిం, నాగాలాండ్​, అరుణాచల్​ ప్రదేశ్​, మణిపూర్​, త్రిపుర కరోనా రహితంగా మారినట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్​ వెల్లడించారు.

five-out-of-eight-ne-states-corona-free-now-jitendra-singh
భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

By

Published : Apr 27, 2020, 10:12 PM IST

ఈశాన్య భారతంలోని 8 రాష్ట్రాలకుగాను.. ఐదు రాష్ట్రాలు కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందాయని..కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌, త్రిపుర.. కొవిడ్-19‌ రహితంగా మారాయని చెప్పారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జితేంద్ర సింగ్.. మిగిలిన మూడు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఎలాంటి కేసులు నమోదుకాలేదన్నారు. ప్రస్తుతం.. అసోంలో 11, మేఘాలయలో 8, మిజోరాంలో ఒక కేసు ఉన్నాయని ఈశాన్య రాష్ట్రాల మండలి‌ సమావేశం తర్వాత తెలిపారు. అసోం, మేఘాలయా, మిజోరాంలోని.. వైరస్ బాధితులు త్వరలోనే కోలుకుంటారని జితేంద్ర సింగ్ వెల్లడించారు.

కరోనాపై పోరులో.. ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. వైరస్‌ వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆరోగ్యరంగ ప్రాజెక్టులు చేపట్టాల్సిందిగా.. మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ వంటి రాష్ట్రాలు కోరాయన్న జితేంద్ర సింగ్..వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details