జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్త్వార్ జిల్లాలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. కుమార్తె మృత దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పానీ నల్లా సమీప ప్రాంతంలో డ్రైవరు నియంత్రణ కోల్పోగా కారు లోయలో పడింది.
ఓ వైపు కుమార్తె మృతదేహం.. అంతలోనే కుటుంబానికి ఇలా! - NATIONAL CRIME NEWS
జమ్ముకశ్మీర్లో ప్రమాదం చోటుచేసుకుంది. కిష్త్వార్ జిల్లాలో అదుపుతప్పిన ఓ కారు.. లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు.
![ఓ వైపు కుమార్తె మృతదేహం.. అంతలోనే కుటుంబానికి ఇలా! Five of family killed as vehicle falls into gorge in JK's Kishtwar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6042448-110-6042448-1581482021291.jpg)
ఓ వైపు కుమార్తె మృతదేహం.. అంతలోనే కుటుంబానికి ఇలా!
లోయలో పడిపోయిన కారు..
ప్రమాదంలో మరణించిన వారికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీఎం సరూరి సంతాపం తెలిపారు. దోడా, కిష్త్వార్, తదితర జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:జీరో ఎఫెక్ట్: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా
Last Updated : Mar 1, 2020, 1:46 AM IST