తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్యాస్​ సిలిండర్​ పేలి.. సజీవ దహనమైన కుటుంబం

అసోం దిబ్రుగఢ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్​ సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

గ్యాస్​ సిలిండర్​ పేలి.. ఐదుగురు సజీవ దహనం

By

Published : Oct 19, 2019, 2:01 PM IST

గ్యాస్​ సిలిండర్​ పేలి.. ఐదుగురు సజీవ దహనం
గ్యాస్​ సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమైన విషాద ఘటన అసోం దిబ్రుగఢ్​ జిల్లాలో జరిగింది. దిబ్రుగఢ్​ నగరానికి సమీపంలోని నిజ్​కోడోమోని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్​ పక్కన ఉన్న గుడిసెలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 1.30 గంటల ప్రాంతంలో వంట గ్యాస్​ పేలి ఒక్క సారిగా మంటలు చెలరేగటం వల్ల గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవ దహనమయ్యారు.

మృతుల్లో మయా సోనార్​ (50), బిషాల్​ సోనార్​ (19), షిబ్​ సోనార్​ (5), శంకర్​ సోనార్​ (3), నును (50)లు ఉన్నట్లు గుర్తించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రూ.4 లక్షల పరిహారం..

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద​ సోనోవాల్​. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

ఇదీ చూడండి: కృత్రిమ గర్భంతో ఒకే కాన్పులో నలుగురు..!

ABOUT THE AUTHOR

...view details