తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: సుప్రీంకు మరో ఐదుగురు రెబల్స్ - bjp

కర్ణాటకలో అసమ్మతి ఎమ్మెల్యేల బుజ్జగింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. రాజీనామా ఉపసంహరణపై మంత్రి నాగ్​రాజ్​ సానుకూల సంకేతాలు ఇచ్చినా... మిగిలినవారు వెనక్కి తగ్గేది లేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. రాజీనామాలు ఆమోదించేలా స్పీకర్​ను ఆదేశించాలని కోరుతూ ఐదుగురు రెబల్స్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కర్ణాటకీయం: సుప్రీంకు మరో ఐదుగురు రెబల్స్

By

Published : Jul 13, 2019, 2:46 PM IST

కర్ణాటక రాజకీయాలు అనూహ్య మలుపులతో రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఐదుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ వెంటనే తమ రాజీనామాలు ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిలో ఆనంద్​ సింగ్​, రోషన్​ బేగ్​ ఉన్నారు.

ఇప్పటికే 10 మంది రెబల్స్​ సుప్రీంకోర్టులో ఇలాంటి వ్యాజ్యమే దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం... కీలక ఆదేశాలు జారీచేసింది. రాజీనామాలు సహా అనర్హత వేటు వేయాలన్న అభ్యర్థనలపై మంగళవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్​కు సూచించింది.

అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్​, జేడీఎస్​ విశ్వప్రయత్నాలు చేస్తున్న వేళ... ఐదుగురు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజీనామా ఉపసంహరణకు మంత్రి నాగ్​రాజ్​ సుముఖుత వ్యక్తంచేసినా... మిగిలిన రెబల్స్​ తిరిగి కూటమిలోకి రావడంపై అనుమానాలు పెరిగేందుకు కారణమైంది.

భాజపాకే మా మద్దతు

సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న స్వతంత్ర సభ్యులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం కనిపించడంలేదు. శాసనసభలో విపక్ష స్థానాల వద్ద తమకు సీట్లు కేటాయించాలని ఎమ్మెల్యేలు ఆర్ శంకర్​, హెచ్​ నగేశ్​​ తాజాగా స్పీకర్​కు లేఖ రాశారు.

కుమారస్వామి ప్రభుత్వాన్ని వీడి, భాజపాకు మద్దతు ఇస్తున్నట్లు స్పీకర్​కు ఈనెల 8న శంకర్​, నగేశ్​ లేఖ రాశారు.

ఇదీ చూడండి: 'ఊరూరా ఉద్యమస్థాయిలో స్వచ్ఛ భారత్'

ABOUT THE AUTHOR

...view details