గుజరాత్- దాహోద్లో తీవ్ర విషాదం నెలకొంది. గోధ్రా రోడ్ ప్రాంతంలోని ఒకే కుటుంబంలో అయిదుగురు సభ్యులు విషం తాగి సామూహిక బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధితుల్లో దంపతులు సహా.. ముగ్గురు పిల్లలూ ఉన్నారు.
ఇదీ జరిగింది..

సుజయ్ భాగ్ ప్రాంతానికి చెందిన సైఫుద్దిన్ .. తన భార్య, ముగ్గురు పిల్లలతో ఓ బహుళ అంతస్తుల భవనంలో నివాసముంటున్నాడు. ఎంతసేపైనా వారి ఇంట్లో ఎలాంటి కదలికలు లేకపోవడం వల్ల.. అనుమానంతో తలుపులు తెరిచారు స్థానికులు. విగత జీవులై పడిఉన్న ఆ కుటుంబసభ్యులను చూసి.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.