గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వడోదరా ప్రాంతంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. వడోదరా నగరం, సెంట్రల్ గుజరాత్ ప్రాంతాల్లో బుధవారం నుంచి 24 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
భారీ వర్షాలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 5 వేల 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
స్తంభించిన రవాణా వ్యవస్థ...
వరుణుడి ప్రతాపానికి రవాణా వ్యవస్థ దెబ్బతింది. వడోదరాలోని రోడ్లు జలమయమయ్యాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. గురువారం సాయంత్రం వరకు వడోదరా విమానాశ్రయం మూతపడే ఉంది.
వడోదరాలో భారీ వర్షాలకు విశ్వామిత్రి నది ఉప్పొంగి నగరంలోని వివిధ ప్రాంతాలకు వరద నీరు చేరుకుంది. దాదాపు 600కు పైగా మొసళ్లకు నిలయం ఆ నది.