సరిహద్దు వెంబడి చొరబాటు కుట్రను భగ్నం చేశాయి భద్రతా దళాలు. పంజాబ్‌లోని భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు తారన్ తరన్ గుండా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టాయి. శనివారం తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
"పంజాబ్ తారన్ తరన్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా దేశంలోకి చొరబాటుకు యత్నిస్తున్నట్లు 103వ బెటాలియన్‌కు చెందిన బలగాలు గుర్తించాయి. వారిని అడ్డుకుని వివరాలు తెలుసుకునే క్రమంలో జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు చొరబాటుదారులు. అది ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. బలగాల కాల్పుల్లో ఐదుగురు దుండగులు హతమయ్యారు. "
- బీఎస్ఎఫ్ అధికారి