మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాను సోమవారం భూకంపం వణికించింది. తలాసరీ తాలూకాలోని గ్రామాలను ఉదయం నుంచి రాత్రి వరకు ఐదుసార్లు ప్రకంపనలు కుదిపేశాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టమేమీ సంభవించలేదని అధికారులు తెలిపారు.
పాల్‌గఢ్‌లో ఒకేరోజు 5 భూకంపాలు - పాల్‌గఢ్‌లో ఒకేరోజు 5 భూకంపాలు
మహారాష్ట్రలోని పాల్‌గఢ్ జిల్లాలో ఒకరోజే ఐదుసార్లు భూమి కంపించింది. స్వల్ప నుంచి మధ్యస్థంగా ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
పాల్‌గఢ్‌లో ఒకేరోజు 5 భూకంపాలు..
తాజా ప్రకంపనల తీవ్రత రిక్టరు స్కేలుపై 3.4 నుంచి 2.4 మధ్య నమోదైందని చెప్పారు. 2018 నవంబరు నుంచి పాల్‌గఢ్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి.