భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు వేల మంది కొవిడ్ బారినపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 9985 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. మరోవైపు దేశంలో కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలిసారిగా బాధితుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైనే బాధితులు కోలుకున్నారు.
మొత్తం బాధితుల్లో 1,35,206 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లగా.. ఇంకా 1,33,632 మంది వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య 7,745కు చేరినట్లు తెలిపింది.
దేశంలో కరోనా పరిస్థితి ఇది..
1. దేశంలో కరోనాకు పెద్ద హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలోనూ సామాజిక వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు 90వేలు పైనే ఉన్నాయి. ఇది వైరస్ పుట్టినిల్లు చైనాలో(84 వేలు) వచ్చిన కేసుల కంటే ఎక్కువ.
2.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసులు మంగళవారమే 51వేలు దాటాయి. ఇది చైనాలోని వుహాన్ కంటే 700 ఎక్కువ.