కశ్మీర్‌కు గతేడాది స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అందులో భాగంగా 43 డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్(డీడీసీ)లు, సర్పంచ్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహణ చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ.. ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మొదటి దశలో.. డీడీసీ, సర్పంచ్, ఉప ఎన్నికల్లో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. వీటిలో 25 కశ్మీర్లో ఉండగా.. 18 జమ్ములో ఉన్నాయి.