చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో.. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి 'మలబార్' నౌకాదళ విన్యాసాలు చేయనుంది భారత్. నవంబర్ 3 నుంచి 6 వరకు విశాఖపట్నం తీరంలో బంగాళఖాతంలో తొలివిడత విన్యాసాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో నవంబర్ 17 నుంచి 20 వరకు రెండో దశ మెగా విన్యాసాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.
మొదటి దశ విన్యాసాల్లో భాగంగా.. క్రాస్-డెక్ ఫ్లయింగ్, సీమ్యాన్ షిప్ వాల్యూషన్స్, ఆయుధ కాల్పుల విన్యాసాలతో పాటు ఉపరితలం, జలాంతర్గామి, యాంటీ-ఎయిర్ వార్ఫేర్ ఆపరేషన్లు ప్రదర్శించనున్నట్టు అధికారులు తెలిపారు. సంక్లిష్టమైన అధునాతన నౌకాదళ ప్రదర్శనలు జరుగనున్నట్లు సమాచారం.