అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటైన 'శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' ఈనెల 19న తొలిసారి భేటీ కానుంది. ట్రస్ట్ అధ్యక్షుడు కె. పరాశరన్ నివాసంలో సమావేశం అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
18నే దిల్లీకి సభ్యులు
ఏప్రిల్ 1న- శ్రీరామనవమి లేదా ఏప్రిల్ 26న- అక్షయ తృతీయ రోజున మందిర నిర్మాణ పనులు ప్రారంభించడమే లక్ష్యంగా ఈ భేటీ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమావేశం కోసం ట్రస్ట్ సభ్యులు ఈనెల 18వ తేదీనే దిల్లీ చేరుకోనున్నారని తెలుస్తోంది. ముఖ్యమైన రోజునే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఇప్పటికే ట్రస్ట్ సభ్యుడు ఒకరు తెలిపారు.