తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహాయ మంత్రుల బాధ్యతలపై రేపు నిర్ణయం! - bjp

కేంద్ర మంత్రి మండలి మొదటిసారిగా రేపు సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రభుత్వ విధివిధానాలపై ప్రధాని నరేంద్రమోదీ మార్గనిర్దేశం చేయనున్నారు.

మంత్రి మండలి సమావేశం

By

Published : Jun 11, 2019, 3:52 PM IST

Updated : Jun 11, 2019, 7:42 PM IST

రేపు మంత్రి మండలి సమావేశం

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన కేంద్ర మంత్రి మండలి రేపు సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రభుత్వ విధివిధానాలపై సభ్యులకు ప్రధాని మార్గనిర్దేశం చేయనున్నారు. సహాయ మంత్రుల బాధ్యతలపైనా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

వచ్చే ఐదేళ్ల ప్రభుత్వ విధానాలపై కార్యాచరణ సిద్ధం చేయనుంది మంత్రిమండలి. ఇదే విషయమై మంత్రులతో మోదీ చర్చిస్తారు. సంక్షేమ పథకాల గురించి నూతన మంత్రులకు వివరించి ప్రజల మధ్యకు తీసుకెళ్లేలా అవగాహన కల్పిస్తారు.

వచ్చేవారం పార్లమెంట్​ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు విపక్షాల ప్రశ్నలకు సమాధానాలిచ్చే బాధ్యతను సహాయ మంత్రులకు అప్పగించనున్నారు.

ఇదీ చూడండి: ప్రొటెం స్పీకర్​గా భాజపా ఎంపీ వీరేంద్ర​కుమార్​

Last Updated : Jun 11, 2019, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details