తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఎలా ఉంటుందో తెలుసా?.. ఈ చిత్రాల్లో చూడండి - corona toll

దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అయితే.. ఆ వైరస్​ ఎలా ఉంటుంది. దాని ఆకృతి ఏమిటి? అనే విషయాలు చాలా వరకు తెలియదు. భారత్​లో తొలి కరోనా కేసు నమోదైన వ్యక్తి నుంచి సేకరించిన నమూనాల నుంచి ఈ మహమ్మారికి సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు శాస్త్రవేత్తలు. వాటి చిత్రాలు, ఏవిధంగా కనుగొన్నారో తెలుసుకుందాం.

First images of Covid-19 virus in India released
భారత్​లోని కరోనా వైరస్​ తొలి చిత్రాల విడుదల

By

Published : Mar 28, 2020, 10:08 PM IST

కరోనా మహమ్మారికి సంబంధించిన చిత్రాలను తొలిసారి విడుదల చేశారు భారత శాస్త్రవేత్తలు. పుణెలోని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​)-ఎన్​ఐవీ శాస్త్రవేత్తల బృందం.. ట్రాన్స్​మిషన్​ ఎలక్ట్రానిక్​ మైక్రోస్కోప్​ సాయంతో కొవిడ్​-19 ఆకృతిని గుర్తించగలిగింది. ఈ చిత్రాలు ఇండియన్​ జర్నల్​ ఆఫ్​ మెడికల్​ రీసర్చ్​లో ప్రచురితమయ్యాయి.

ఈఏడాది జనవరి 30న కేరళలో తొలి కరోనా కేసు నమోదైంది. ఆ వ్యక్తి గొంతులోనుంచి సేకరించిన నమూనాలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు సార్స్​-కోవ్​-2 (కొవిడ్​-19) చిత్రాలను కనుగొన్నారు.

కరోనా వైరస్​ చిత్రాలు

భారత్​లో గుర్తించిన వైరస్ జన్యు నమూనాలు వుహాన్​కు చెందిన వైరస్​ జన్యువుతో 99.98 శాతం మేర పోలివున్నట్లు పరిశోధనలో తేలింది.

ఇదీ చూడండి: దేశంలో 900 దాటిన కరోనా కేసుల సంఖ్య

ABOUT THE AUTHOR

...view details