తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శునకాలకు సంరక్షణ, అంత్యక్రియలు.. అంతా తానై - dogs news

ప్రస్తుత పరుగుల ప్రపంచంలో మనిషి చనిపోతేనే ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక వారికి అంత్యక్రియలు అంటే ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. ఇలాంటి సమాజంలో ఉంటూ ఓ ఉదాత్త హృదయుడు మూగజీవులకు సైతం అన్నీ లాంఛనాలతో అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్నాడు. మానవత్వం అనేది ఇంకా భూమిపైన మిగిలే ఉందని చాటి చెపుతున్నాడు. అతని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరి చదవండి.

dog funerals
శునకాలకు సంరక్షణ, అంత్యక్రియలు.. అంతా తానై

By

Published : Dec 15, 2019, 6:47 AM IST

శునకాలకు సంరక్షణ, అంత్యక్రియలు.. అంతా తానై

మనిషి చనిపోతే అంతిమసంస్కారాలు చేయటానికి ప్రత్యేక స్థలాలు ఉంటాయి. మూగ జీవాలకు అలాంటి సౌకర్యాలు కనిపించిన దాఖలాలు లేవు. రోడ్లపై శునకాలు చనిపోయి కనిపించటంపై చలించిపోయిన మధ్యప్రదేశ్​ భోపాల్​కు చెందిన ఓ పశువైద్యుడు వాటికి శ్మశానవాటికలను నిర్మించాడు. అంతే కాదు ఆ మూగజీవాలకు అంతా తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు.
ఎలా మొదలైంది.

మధ్యప్రదేశ్​ భోపాల్​ నగరంలో ​ రోడ్లపై దుర్మరణం చెందే శునకాలను చూసి చలించిన వైద్యుడు తన వంతుగా ఏదైనా చేయాలని కాంక్షించాడు. అలా తన మదిలో మెదలిన ఆలోచనతో ఓ ఆశ్రమం నిర్మించాడు. ప్రస్తుతం 40కిపైగా శునకాల పోషణ చూసుకుంటూ .. వాటికి చికిత్స అందిస్తున్నాడు. వాటి కోసం ప్రత్యేకంగా శ్మశానవాటికను నిర్మించాడు. అంతిమసంస్కారాలు చేస్తున్నాడు.

"ఏడాదిన్నర కితం మేము వీధి శునకాల ఆశ్రయం నిర్మించాం. ఇందులో 40కి పైగా ఉన్నాయి. పప్పీల కోసం ప్రత్యేక విభాగం రూపొందించాం. అవి స్వేచ్ఛగా తిరిగేందుకు ఓ ఉద్యానవనం, ప్రత్యేక స్థలం కేటాయించాం. వీటి సంరక్షణ చూసుకుంటాం. శునకాలకి వెకానిక్​ పద్ధతిలో అంతిమసంస్కారాలు చేస్తాం. "
-డా. అనిల్​కుమార్​ శర్మ, వెటర్నరి డాక్టర్​.

ఎన్జీఓ సంస్థ

క్రమక్రమంగా ఈ సామాజిక సేవని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రకృతి అనే ఎన్జీఓ సంస్థను ఏర్పాటు చేశారు వైద్యుడు. ప్రస్తుతం ఇందులో 62మంది భాగస్వాములై తమ వంతు సహకారం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'పౌర' సెగ: ఆయిల్​ ట్యాంకర్​కు నిప్పు.. డ్రైవర్​ మృతి

ABOUT THE AUTHOR

...view details