తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముమ్మారు తలాక్​పై దిల్లీలో మొదటి కేసు - కట్నం

ముమ్మారు తలాక్​ నిషేధం అమలు జరిగి నెల కాకముందే దిల్లీలో మొదటి కేసు నమోదైంది. కట్నం ఇవ్వలేదని  తన భార్యకి తలాక్​ చెప్పాడు ఓ వ్యక్తి. సదరు మహిళ పోలీసులను ఆశ్రయించగా భర్తను అదుపులోకి తీసుకున్నారు.

ముమ్మారు తలాక్​ పై మొదటి కేసు నమోదు.

By

Published : Aug 11, 2019, 6:01 AM IST

Updated : Aug 11, 2019, 6:52 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే.. తక్షణ ముమ్మారు తలాక్​ను నిషేధిస్తూ చట్టాన్ని రూపొందించింది. ఇది అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే దిల్లీలో తొలికేసు నమోదైంది. జూన్ 23న ఓ వ్యక్తి తన భార్యకు వెంటవెంటనే 3 సార్లు తలాక్​ పలకడంతో పాటు, వాట్సాప్​లో ఫత్వా పంపించాడు. సదరు మహిళ దిల్లీలోని నిబారా హిందూరావ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ముస్లిం మహిళల వివాహ రక్షణ చట్టం 2019 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడించారు.

కట్నం కోసం తలాక్​

2011లో వారిద్దరికీ వివాహం జరిగింది. భర్త, అతని కుటుంబం.. తనను వరకట్నం కోసం వేధించేవారని... అలా చివరకు ముమ్మారు తలాక్​ చెప్పి తన ఆరేళ్ల కొడుకుతో సహా బయటకు గెంటేశారని ఆరోపించింది బాధితురాలు.

Last Updated : Aug 11, 2019, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details