తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టార్గెట్​ చైనా: కొద్దిరోజుల్లో భారత్​కు రఫేల్​ జెట్స్

సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారతీయులకు శుభవార్త అందింది. వాయుసేన ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యాధునిక రఫేల్​ యుద్ధ విమానాలు జులై 27నాటికి భారత్​కు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 36 విమానాల్లో తొలుత ఆరు రఫేల్​ జెట్​లు దేశానికి రానున్నాయి.

First batch of six Rafale jets likely to arrive in India by July 27; to be based in Ambala
జూలై 27నాటికి భారత్​లో అడుగుపెట్టనున్న రఫేల్​

By

Published : Jun 29, 2020, 6:10 PM IST

జులై 27నాటికి ఆరు రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇవి రావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

లాంగ్‌ రేంజ్‌ మిటియార్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులతో రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకోనున్నాయి. 150కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ క్షిపణుల సొంతం. ఈ క్షిపణులతో రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌ వైమానిక దళంలో చేరితే.. చైనా వైమానిక దళం కంటే మనకు అదనపు ప్రయోజనం చేకూరినట్లు అవుతుంది.

రఫేల్‌ యుద్ధ విమానాలు నడిపేందుకు ప్రస్తుతం ఫ్రాన్స్‌లో మన పైలట్లకు శిక్షణ కొనసాగుతోంది. తొలి బ్యాచ్‌లో ఏడుగురు భారత పైలట్లు శిక్షణ పొందుతుండగా.. మరో బ్యాచ్‌ త్వరలోనే ఫ్రాన్స్‌ వెళ్లనుంది. రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చిన వెంటనే కొద్ది రోజుల్లోనే కార్య రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

భారత వైమానిక దళం అవసరాలు తీర్చడానికి 36 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం.. 2016 సెప్టెంబర్‌లో భారత్ రూ. 60వేల కోట్లతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:-కయ్యానికి కాలు దువ్వితే చైనాకే నష్టం!

ABOUT THE AUTHOR

...view details