తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు  బయలుదేరిన రఫేల్ యుద్ధ విమానాలు - rafale france

రఫేల్ యుద్ధవిమానాలు మరో రెండు రోజుల్లో భారత అమ్ముల పొదిలోకి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి ఐదు యుద్ధ విమానాలు ఇవాళ టేకాఫ్ అయ్యాయి. బుధవారం నాటికి భారత్​లోని అంబాలా వైమానిక స్థావరానికి అవి చేరుకుంటాయి.

first batch of rafale to take off today from france marignac airbase
ఫ్రాన్స్​ నుంచి ఇవాళ బయలుదేరనున్న రఫేల్!

By

Published : Jul 27, 2020, 11:54 AM IST

Updated : Jul 27, 2020, 3:16 PM IST

రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్​కు బయలుదేరాయి. తొలి దశలో 5 రఫేల్ యుద్ధ విమానాలు భారత్​కు చేరుకోనున్నాయి. ఈ ఐదు రఫేల్ విమానాలు బుధవారం అంబాలాలోని వైమానిక స్థావరానికి చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్​కు ఈ లోహ విహంగాలు బయలుదేరాయి.

రఫేల్ యుద్ధ విమానాలు
ఫ్రాన్స్​ నుంచి ఇవాళ బయలుదేరనున్న రఫేల్!
రఫేల్ విమానం

మార్గమధ్యలో అబుదాబి సమీపంలోని అల్-దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్‌బేస్ వద్ద రఫేల్​ విమానాలు ఆగనున్నట్లు ఎయిర్​ఫోర్స్ అధికారులు వెల్లడించారు. తొలిదశలో రానున్న 5 విమానాలలో రెండు శిక్షణ, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు స్పష్టం చేశారు.

Last Updated : Jul 27, 2020, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details