భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కాలాపానీ ప్రాంతంపై వివాదం కొనసాగుతున్న వేళ.. బిహార్ సోన్బర్సాలోని జానకీనగర్ సరిహద్దు ప్రాంతంలో భారత పౌరులపై కాల్పులకు తెగబడ్డారు నేపాల్ పోలీసులు. సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల్లో పనులు చేసుకుంటున్న కూలీపై కాల్పులు జరపగా .. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒకరిని నేపాల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు స్థానికంగా ఉండే ఉమేశ్ రామ్, ఉదయ్ ఠాకూర్లుగా గుర్తించారు అధికారులు.
18 రౌండ్ల కాల్పులు..