బెంగళూరులో ఓ పిల్లిని హత్య చేశారు దుండగులు. పిల్లి యజమాని గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశాడు.
అబ్రహాం ఆంటోనీ.. స్థానిక స్కైహైక్ విల్లాస్లో నివాసముంటున్నాడు. ఓ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి వెనక పెరట్లో రెండు సార్లు కాల్పులు జరిగిన శబ్ధం వినిపించి పరిగెత్తుకెళ్లాడు అబ్రహాం. ఆ తుపాకీ తూటాలు తగిలి, తన పెంపుడు పిల్లి నెత్తుటి మడుగుల్లో పడి ఉండడం చూసి బెంబేలెత్తిపోయాడు. వెంటనే సర్జాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.