ఉత్తర్ప్రదేశ్లోనిఘజియాబాద్లో కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య కలహాలు నడిరోడ్డుపైనే కాల్పులకు దారితీశాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
భూవివాదంతో నడిరోడ్డుపైనే కాల్పులు - ఘర్షణ
భూ తగాదాలు ఎప్పుడూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. కానీ... అదే వివాదం కాల్పుల వరకు వెళ్లింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో. నడిరోడ్డుపైనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు తుపాకులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భూవివాదంతో నడిరోడ్డుపైనే కాల్పులు
భూవివాదంతో నడిరోడ్డుపైనే కాల్పులు
భూమి విషయంలో ఘర్షణే కాల్పులకు కారణమని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వాహబ్ చౌదరి అనుచరులు మరో వర్గంపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాహబ్ సోదరుడి నుంచి పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మరో నిందితుడ్ని పట్టుకుంటామని తెలిపారు.