కేరళలో రక్తస్రావమైన ఓ గిరిజన గర్భిణిని నది దాటించడానికి సాహసమే చేశారు అగ్ని మాపక సిబ్బంది. ప్రాణాలకు తెగించి మహిళను ఆసుపత్రిలో చేర్చారు. ప్రవహిస్తున్న నదిలో , కుండపోత వానలో గర్భిణిని.. నది దాటించారు.
మలప్పురం జిల్లా, నిలాంబర్, ముండేరి తారిప్పపొట్టికి చెందిన కాంచన మూడు నెలల గర్భిణి. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంచనకు ఉన్నట్టుండి రక్తస్రావమైంది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైందోనని తల్లడిల్లింది కాంచన. ఆ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్లడానికి చలియార్ నదిపై నిర్మించిన ఓ వంతెనే ఏకైక దారి. కానీ, భారీ వర్షాలకు నది ఉప్పొంగింది, వంతెన మీదుగా నది ప్రవహిస్తోంది. అసలే నొప్పితో బాధపడుతున్న కాంచన వంతెన దాటే పరిస్థితి లేదు. ఈ సాయం కోసం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు కుటుంబసభ్యులు.