ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న స్థిరాస్తి వ్యాపార సంస్థ ఆమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దిల్లీలో ఈ సంస్థ చేపట్టి మధ్యలో ఆపేసిన ఇళ్ల నిర్మాణ పనులను ఎవరు పూర్తి చేస్తారనే దానిపై స్పష్టతనివ్వనుంది. సుమారు 42 వేల మంది బాధితులకు ఉపశమనం కల్పించేలా నిర్ణయం తీసుకోనుంది న్యాయస్థానం. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
ఆమ్రపాలి గ్రూప్ సంస్థ మధ్యలో నిలిపేసిన పనులను చేపట్టేందుకు తమవద్ద నిధులు లేవని నోయిడా, గ్రేటర్ నోయిడా అధికార వర్గాలు మే 10న కోర్టుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో తీర్పును వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.