దిల్లీ అగ్నిప్రమాదంలో 43 మంది దుర్మరణం పాలవడంపై రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా సహా పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సంతాపం వ్యక్తం చేస్తున్నా
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ కార్మికుల మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.
దారుణం
నరేంద్ర మోదీ, ప్రధాని ట్వీట్ "దిల్లీ అగ్నిప్రమాదం చాలా దారుణమైన ఘటన. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను." - ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..
ప్రమాదస్థలంలో సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రాహుల్, షా
కేంద్రహోంమంత్రి అమిత్షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
43 మంది దుర్మరణం
దిల్లీ అనాజ్ మండీలోని ఓ కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 43 మంది కార్మికులు మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 50 మందికి పైగా కార్మికులను రక్షించారు.
ఇదీ చూడండి:దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం- 43 మంది దుర్మరణం