తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు - పాల్మా భవనంలో అగ్నిప్రమాదం

ముంబయి అగ్నిప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మలబార్​ హిల్​ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది.

mumbai
ముంబయి అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురికి గాయాలు

By

Published : Feb 6, 2020, 9:40 AM IST

Updated : Feb 29, 2020, 9:14 AM IST

ముంబయిలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు

ముంబయి మలబార్​ హిల్​ ప్రాంతంలోని ఓ 15 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.

18 మంది సురక్షితం...

మంగళవారం రాత్రి పాల్మా భవనంలోని 5వ అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కింది అంతస్తులకు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది 8 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న 18 మందిని రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు.

ఇదీ చూడండి : అరటి చెట్టుతో జీవ విద్యుత్.. యువ మేధావి ప్రతిభ

Last Updated : Feb 29, 2020, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details