అసోంలోని టిన్సుకియా జిల్లాలో చమురు బావిలో చెలరేగిన మంటలు ఇప్పటికీ అదుపు కాలేదు. రోజురోజుకూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. వీటిని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇటీవలే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. చమురు బావి ప్రమాదంతో ప్రభావితమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం సహా అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా సామర్థ్యాలను మెరుగుపరచాలని తెలిపారు మోదీ.