పుదుచ్చేరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హార్బర్ సమీపంలోని పడవ తయారీ కర్మాగారంలో ఈ తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది... తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు.
పడవ తయారీ ఫ్యాక్టరీలో మంటలు.. భారీగా ఆస్తినష్టం - పడవ తయారీ కర్మాగారంలో మంటలు
పుదుచ్చేరిలోని హార్బర్ సమీపంలో ఉన్న పడవ తయారీ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.
పడవ తయారీ కర్మాగారంలో మంటలు .. భారీ ఆస్తి నష్టం
భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
పడవ తయారీ కర్మాగారంలో మంటలు