తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హార్డ్​వేర్​ దుకాణంలో చెలరేగిన మంటలు- రెండు షాపులు దగ్ధం - కర్ణాటక విట్లా టౌన్​ బస్​స్టాప్​ సమీపంలో అగ్నిప్రమాదం

కర్ణాటకలోని విట్లా టౌన్​ బ​స్టాండ్​ సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు షాప్​లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ హార్డ్​వేర్​ షాప్​లో చెలరేగిన మంటలు.. పక్కనే ఉన్న బేకరీకి అంటుకుని రెండు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.

Fire Breaks out near Vitla Bus Stop
కర్ణాటకలో అగ్ని ప్రమాదం కాలిన బుడిదైన దుకాణాలు

By

Published : Oct 20, 2020, 3:23 PM IST

Updated : Oct 20, 2020, 3:29 PM IST

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని విట్లా టౌన్​ ఆర్​టీసీ​ బస్టాండ్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

తొలుత ఓ హార్డ్​వేర్​ దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న బేకరీకి అంటుకున్నాయి. ప్రమాదం గురించి భవన యజమానికి స్థానికులు సమాచారం ఇవ్వగా.. మంటలను అదుపు చేసే చర్యలు మొదలు పెట్టే సరికే.. షాపులు పూర్తిగా మంటలకు ఆహుతైనట్లు స్థానికులు తెలిపారు.

అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.

దక్షిణ కన్నడ జిల్లాలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి:కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి!

Last Updated : Oct 20, 2020, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details