ఒడిశాలోని కటక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగత్పుర్లోని సద్గురు కొవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పి వేశాయి. అయితే.. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.
ఆసుపత్రి భవనంలో గల గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దఎత్తున మంటలు చెలరేగగా.. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం 152 మంది ఉన్నట్టు తెలుస్తోంది.