తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గూడ్స్​ రైల్లో చెలరేగిన మంటలు.. దగ్ధమైన బోగి - పీడీఏ కాలేజ్ రైలు మంటలు

కర్ణాటక కలబురిగి సమీపంలో గూడ్స్​ రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కలబురిగి రైల్వే స్టేషన్ సమీపంలోని పీడీఏ కాలేజీ గేట్​ వద్ద రైలులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Fire Breaks out in a goods Train in Kalburgi
గూడ్స్​ రైల్లో చెలరేగిన మంటలు.. దగ్ధమైన బోగి

By

Published : Jan 2, 2020, 12:15 PM IST

కర్ణాటక కలబురిగిలో ఓ గూడ్స్​ రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కలబురిగి రైల్వే స్టేషన్ సమీపంలోని పీడీఏ కాలేజీ గేట్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు కంపార్ట్​మెంట్​లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారందరు సురక్షితంగా బయటపడ్డారు.

గూడ్స్​ రైల్లో చెలరేగిన మంటలు.. దగ్ధమైన బోగి

కంపార్ట్​మెంట్​లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి: హీరో విశాల్​తో గుత్తాజ్వాల డేటింగ్.. ఫొటోలు వైరల్​!

ABOUT THE AUTHOR

...view details