తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో రెండు వేర్వేరు చోట్ల భారీ అగ్నిప్రమాదం - నొయిడాలో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాలో రెండు వేరు వేరు ప్రదేశాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని అధికారులు తెలిపారు.

Fire breaks out at two commercial properties in Noida
యూపీలో రెండు వేర్వేరు చోట్ల భారీ అగ్ని ప్రమాదం

By

Published : Jun 1, 2020, 12:43 PM IST

Updated : Jun 1, 2020, 12:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలో రెండు వేర్వేరు వ్యాపార సంస్థల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ఫేజ్​-3 ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ పరుపుల ఉత్పత్తి కంపెనీలోని నాలుగంతస్తుల భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

యూపీలో రెండు వేర్వేరు చోట్ల భారీ అగ్నిప్రమాదం

నొయిడాలోని ఫేజ్​-2 ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో షాట్ సర్క్యూట్​ వల్ల మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శానిటైజర్​ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక దళాలు.. మంటలను అదుపులోకి తెచ్చాయి.

ఇదీ చదవండి:ఉత్తర్​ప్రదేశ్​లో వరుణుడి బీభత్సం.. 43 మంది మృతి

Last Updated : Jun 1, 2020, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details