ఆగ్నేయ దిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లోఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 1,000 నుంచి 12 వందలు పూరిగుడిసెలు దగ్ధమయినట్లు పోలీసులు తెలిపారు.
ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యికి పైగా గుడిసెలు దగ్ధం - Delhi fire
దిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు వెయ్యికి పైగా గుడిసెలు బూడిదైపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యికి పైగా గుడిసెలు దగ్ధం
రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మురికివాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులంతా భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు గుడిసెలకు విస్తరించాయి. దాదాపు 28 అగ్నిమాపక యంత్రాలతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు.