దిల్లీలోని కిరారి ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ వస్త్ర గోదాంలో సోమవారం వేకువజామున భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి 12.30గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
దిల్లీలో అగ్నిప్రమాదం.. 9 మంది మృతి - 9 died in delhi fire accident
దేశరాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో జరిగిన ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. 10మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అర్ధరాతి 12.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మంటలకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
దిల్లీలో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
దిల్లీలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెల 8న అనాజ్‌మండీ ప్రాంతంలోని ఓ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: జన స్థిరీకరణకు మేలిమి వ్యూహం
Last Updated : Dec 23, 2019, 7:38 AM IST