మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ జుట్టు పట్టుకొని లాగి దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరి నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా నిరసన ప్రదర్శన నిర్వహించినందుకు... 124 మంది భాజపా నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో 17 మందిని అరెస్టు చేశారు.
డిప్యూటీ కలెక్టర్‌పై దాడి.. ఎఫ్ఐఆర్ నమోదు - భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు..
పౌరసత్వ చట్టానికి మద్దతుగా చేస్తున్న ర్యాలీని అడ్డుకున్న డిప్యూటీ కలెక్టర్ జుట్టు పట్టుకొని లాగిన ఘటన మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ చర్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
![డిప్యూటీ కలెక్టర్‌పై దాడి.. ఎఫ్ఐఆర్ నమోదు fir-registered-against-two-persons-for-hitting-and-pulling-hair-of-rajgarh-deputy-collector-priya-verma](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5771378-thumbnail-3x2-caa.jpg)
డిప్పూటీ కలెక్టర్‌పై దాడి చేసిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు
డిప్యూటీ కలెక్టర్‌పై దాడి.. ఎఫ్ఐఆర్ నమోదు
పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు..... ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని రాజ్‌గఢ్ కలెక్టర్ నివేదిత, డిప్యూటీ కలెక్టర్ ప్రియా వర్మ అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వాగ్వాదంలో... నిరసనకారుల్లో ఇద్దరు ప్రియావర్శ జుట్టు పట్టుకొని లాగారు.
ఇదీ చూడండి: ఫుట్‌బాల్ స్టేడియం గ్యాలరీ కూలి 50 మందికి గాయాలు
Last Updated : Jan 20, 2020, 3:07 PM IST