తెలంగాణ

telangana

ప్రముఖ ఆసుపత్రిపై ఎఫ్​ఐఆర్​.. కారణం!

By

Published : Jun 6, 2020, 11:06 PM IST

కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు దేశ రాజధానిలోని ప్రముఖ సర్​ గంగారామ్​ ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దిల్లీ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

FIR against Ganga Ram hospital for 'violating' COVID-19 norms
కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ప్రముఖ ఆసుపత్రిపై ఎఫ్​ఐఆర్​

కరోనాకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దిల్లీలోని ప్రముఖ సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిపై కేసు నమోదైంది. దిల్లీ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సుమారు 675 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని జూన్‌ 3న కొవిడ్‌ సేవలు అందించేందుకు దిల్లీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, ఆసుపత్రి యాజమాన్యం ఉత్తర్వులను బేఖాతరు చేసిందంటూ ఇచ్చిన ఫిర్యాదుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు కేసు నమోదు చేశారు.

కరోనా పరీక్షలకు ఆర్‌టీ-పీసీఆర్‌ యాప్‌ను వినియోగించకపోవడమే కారణమని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాంపిళ్లను సేకరించే ల్యాబ్స్‌ తప్పనిసరిగా ఈ యాప్‌ను వాడాల్సి ఉంది. సదరు ఆసుపత్రి ఆ యాప్‌ను వినియోగించకపోవడం వల్ల అంటు వ్యాధుల చట్టం 1897 కింద కొవిడ్‌ -19 నిబంధనలు పాటించని కారణంగా కేసు నమోదు చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ యాప్‌ను తీసుకురాగా.. దిల్లీ ప్రభుత్వం యాప్‌ వినియోగాన్ని తప్పనిసరి చేసింది

ABOUT THE AUTHOR

...view details