తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర'చట్ట ఆందోళనల్లో పాల్గొన్న ఎస్పీ నాయకులపై కేసులు - More than 12,200 cases, 104 people have been arrested

'పౌర' చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు నమోదయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ ఎంపీ సహా 31 మంది పార్టీ నాయకులు,150 మంది కార్యకర్తలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. మహారాష్ట్రలో 104 మందిని అరెస్టు చేసి, 12 వేలకు పైగా కేసులు బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.

fir-against-31-sp-leaders-including-rs-mp-150-party-workers-for-anti-caa-protests
పౌర చట్ట ఆందోళనల్లో సమాజ్​వాదీ నాయకులపై కేసులు

By

Published : Dec 23, 2019, 11:40 PM IST

దేశ వ్యాప్తంగా పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పార్టీల నాయకులపై, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ సహా 31 మంది నాయకులు, 150 మంది కార్యకర్తలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఎటువంటి అనుమతి లేకుండా డిసెంబర్​ 19న పౌర చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఎస్పీ నాయకులు, కార్యకర్తలపై సెక్షన్​ 144 కింద కోట్​వాలీ పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్​హెచ్​ఓ దినేష్​ ప్రతాప్​ సింగ్​ తెలిపారు.

మహారాష్ట్రలో

సెంట్రల్​ మహారాష్ట్రలో పౌరచట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వారిపై కేసులు నమోదయ్యాయి. పరభణీ, హింగోలీ, బీడ్ జాల్లాల్లో 12,200 కేసులు నమోదయ్యాయి. 104 మందికి పైగా అరెస్టయ్యారు.

అనుమతి లేకుండా నిరసనలు చేపట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడి ప్రభుత్వ, ప్రైవేట్​ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details