తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై పోరు: పీఎం కేర్స్​ ఫండ్​కు విరాళాల వెల్లువ - కరోనా మరణాలు

కరోనాపై పోరాడేందుకు పీఎం కేర్స్ ఫండ్​కు భారీగా విరాళాలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, బ్యాంకులు కలిసి రూ.430 కోట్లు ప్రకటించాయి. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇచ్చారు.

FinMin officials, banks, FIs contribute Rs 430 cr to PM CARES Fund
కరోనాపై పోరు: పీఎం కేర్స్​ ఫండ్​కు విరాళాల వెల్లువ

By

Published : Apr 6, 2020, 8:22 AM IST

కరోనాపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​ ఫండ్​కు విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. మహమ్మారి బారిన పడ్డ వారికి సాయం అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకు చెందిన అధికారులు కలిసి రూ.430.63 కోట్ల విరాళం అందజేశారు.

వివరాలు...

ఇందులో ఎల్​ఐసీ(జీవిత బీమా సంస్థ) 105 కోట్లు

ఎస్​బీఐ (భారతీయ స్టేట్​ బ్యాకు) రూ.100కోట్లు

ఇండియా ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కంపెనీ లిమిటెడ్​ (ఐఐఎఫ్​సీఎల్​) రూ.25 కోట్లు

నెలసరి ఆదాయం...

మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 28 సంస్థలు, విభాగాలు కలిసి రూ.38 కోట్లను పీఎం కేర్స్ ఫండ్​కు ఇచ్చాయి. హెచ్​ఆర్​డీ మంత్రి రమేశ్​ పోక్రియాల్​​ తన నెలసరి వేతనాన్ని అందజేశారు. వాటితో పాటు ఎంపీలాడ్స్​ నుంచి కోటి రూపాయలను ప్రకటించారు.

ఒక రోజు వేతనం విరాళంగా..

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు, సంబంధిత కార్యాలయాల్లోని సిబ్బంది ఒక రోజు వేతనం పీఎం కేర్స్​ ఫండ్​కు విరాళంగా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు. ఈ క్రమంలో రూ.1.14 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.

మహమ్మారిపై పోరాడేందుకు పీఎం కేర్స్​ ఫండ్​కు విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న కోరారు.

ABOUT THE AUTHOR

...view details