రహదారి ప్రమాదాలను అరికట్టడానికి కేంద్రం సమాయత్తమైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించేవారిపై భారీ జరిమానాలను విధించేలా మోటార్ వాహనాల బిల్లులో చేసిన సవరణలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడం వల్ల కాలం చెల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం బిల్లులో సవరణలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం.
రోడ్డు భద్రత అంశంలో కఠినమైన నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.
- చిన్నపిల్లలు వాహనాలు నడపడం.
- తాగి వాహనాలు నడపడం.
- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం
- అతివేగం, మోతాదుకు మించి సరుకుల రవాణా వంటి నేరాలపై కఠిన చర్యలు ఉండనున్నాయి
వీటికి రూ.10,000 జరిమానా..!
అంబులెన్స్ తరహా అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వారిపై రూ.10,000 వరకూ జరిమానా విధించనున్నారు. అనర్హతకు గురైన వ్యక్తులు వాహనాన్ని నడిపితే రూ.10,000 జరిమానా విధించాలని కొత్త బిల్లులో ప్రతిపాదించింది ప్రభుత్వం.
అక్షరాలా రూ.లక్ష జరిమానా..!
లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించేవారికి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని బిల్లులో పొందుపరిచారు.
జైలుశిక్ష కూడా...!