తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐక్యతా విగ్రహం చుట్టూ.. ఇనుప మొక్కలతోట! - ఇనుముతో తయారు చేసిన అనేక రకాల జెముడు జాతి మొక్కలు

ప్రపంచంలోనే ఎత్తైన ఐక్యతా విగ్రహం చుట్టూ ఓ ఇనుప తోట మొలకెత్తనుంది. అవును, ఇకపై అక్కడ ఎటు చూసినా ఇనుప జెముడు  మొక్కలే కనిపించనున్నాయి. పర్యటకులను ఆకట్టుకునేలా రంగురంగుల ఇనుప ముళ్ల పొదలు దర్శనమివ్వనున్నాయి.

ఐక్యతా విగ్రహం చుట్టూ.. ఇనుప మొక్కలతోట!

By

Published : Oct 14, 2019, 5:47 AM IST


ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్​ వల్లభాయ్​పటేల్​ ఐక్యతా విగ్రహానికి సరికొత్త కళను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది గుజరాత్​కు చెందిన ఓ బృందం. ఇనుముతో తయారు చేసిన అనేక రకాల జెముడు జాతి మొక్కలతో​ ఐక్యతా విగ్రహం చుట్టూ అలంకరించేందుకు సిద్ధమైంది వడోదరలోని మహారాజాసయాజీరావు యూనివర్సిటీ బృందం. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీల పెయింటింగ్​లనూ ఇనుప జెముడు తోటలో ఏర్పాటు చేయనున్నారు.

ఐక్యతా విగ్రహం చుట్టూ.. ఇనుప మొక్కలతోట!

పర్యటకులను ఆకర్షించేందుకు విభిన్న కళాఖండాలను సృష్టిస్తోందీ బృందం. రంగు రంగుల ఇనుపనాగ జెముడు, బ్రహ్మ జెముడు వంటి మొక్కలను తయారు చేస్తున్నారు. ఈ ఇనుప కాక్టస్​(జెముడు) మొక్కల తయారీలో హాని రహిత రంగులను ఉపయోగిస్తున్నారు. సుమారు నాలుగు అడుగుల నుంచి పదహారు అడుగుల వరకు ఉండే కాక్టీని అధ్యాపకులు రూపొందించారు.

" సర్దార్​ వల్లభాయ్​ స్మారక చిహ్నం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక కాక్టస్ గార్డెన్(జెముడు తోట) తయారు చేస్తున్నాం. దీని కోసం మేము వివిధ రకాల ఇనుప కాక్టీలను డిజైన్ చేస్తున్నాము. కళాకృతులను చిత్రీకరించడానికి ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించింది. మేము ఈ కాక్టీలను సుమారు 8,000 చదరపు అడుగుల గోడపై ఉంచుతాము."
- జయంతి ఎల్ రబాడియా, ఫైన్ ఆర్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్

ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా పేరుగాంచి.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ స్మారకర్థంగా ఎన్​డీఏ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని నిర్మించింది. అంతటి మహోన్నతమైన ప్రదేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఫైన్​ ఆర్ట్​ విభాగం అధ్యాపక బృందం ఇలా వినూత్న ప్రయత్నం చేస్తోంది.

ఇదీ చూడండి:ఆ గ్రామాల్లో యువకులందరూ పెళ్లికాని ప్రసాదులే..!

ABOUT THE AUTHOR

...view details