ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీఎస్టీ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2017 జులై నుంచి 2020 జనవరి మధ్య ఎలాంటి బకాయిలు లేకుండా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారిపై ఆలస్య రుసుము విధించబోమని చెప్పారు. జీఎస్టీ మండలి సభ్యులతో సమావేశమైన ఆర్థిక మంత్రి ఈ మేరకు జీఎస్టీ దాఖలుపై నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రాలకు కరోనా నేపథ్యంలో చెల్లించాల్సిన పరిహారంపై జులైలో మరోసారి సమావేశమవుతామని చెప్పారు.
ఆలస్య రుసుములు ఇలా..
పన్ను బకాయిలు ఉన్నవారు, 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారని నుంచి గరిష్ఠ ఆలస్య రుసుముగా రూ. 500 వసూలు చేయనున్నట్లు చెప్పారు నిర్మల. ఈ మొత్తం 2020 జులై 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య రిటర్నులు దాఖలు చేసే వారి నుంచి మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించారు ఆర్థికమంత్రి.