తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చివరి సెమిస్టర్​ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరి' - Final year semester exams

కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ విశ్వవిద్యాలయ పరీక్షలను సెప్టెంబర్​లో నిర్వహించాలని ఆదేశించింది కేంద్ర మానవ వనరుల శాఖ. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి పరీక్షల నిర్వహణ చేపట్టాలని యూనివర్శిటీలు, విద్యాసంస్థలకు స్పష్టం చేసింది. ఆఖరు సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ప్రకటించింది.

Final-year examinations in universities will be conducted by September-end
చివరి సెమిస్టర్​ విద్యార్థులకు పరీక్షలు తప్పనిసరి

By

Published : Jul 7, 2020, 5:01 AM IST

దేశవ్యాప్తంగా 'అన్​లాక్​-2' కొనసాగుతోన్న తరుణంలోనే విశ్వవిద్యాలయాలు సహా ఇతర విద్యాసంస్థల చివరి సెమిస్టర్​ పరీక్షలను జరపాలని నిర్ణయించింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్​​ఆర్​డీ). వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతోన్న విద్యార్థులకు జరిపే ఈ పరీక్షలను సెప్టెంబర్​లో నిర్వహించాలని ఎంహెచ్​ఆర్​డీ ఆదేశించింది.

గతంలో జులైలో పరీక్షలు నిర్వహించాలని సూచించిన యూనివర్శిటీ గ్రాంట్స్​ కమిషన్​(యూజీసీ).. తాజాగా వాటిని సెప్టెంబర్​లో జరపాలని నిర్ణయం తీసుకుంది ఎంహెచ్​ఆర్​డీ. తుది సెమిస్టర్​ పరీక్షలు నిర్వహించడం తప్పనిసరని యూజీసీ స్పష్టం చేసింది. ఎంహెచ్​ఆర్​డీ ప్రకటనతో ఆఖరి సెమిస్టర్​ పరీక్షల నిర్వహణ విషయంలో తలెత్తిన సందేహాలపై సందిగ్ధత వీడింది.

యూజీసీ సూచనల మేరకు..

కరోనాపై తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని పరీక్షల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల్లో సవరణలు చేయాలని ఇటీవల ఎంహెచ్​ఆర్​డీ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​కు సూచించింది యూజీసీ. ఈ నేపథ్యంలో సోమవారం ప్రత్యేకంగా భేటీ అయిన కమిషన్​.. సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆదేశాలను ఆయా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటిస్తూ పరీక్షల నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.

ఆ మార్గదర్శకాలివే..

  • చివరి సెమిస్టర్​ పూర్తయ్యేలోపు విశ్వవిద్యాలయం సాధ్యాసాధ్యాలను బట్టి తప్పనిసరిగా పరీక్షలను నిర్వహించాలి. ఆఫ్​లైన్​, ఆన్​లైన్​ పద్ధతుల్లో లేదా రెండింటి మిశ్రమంగా పరీక్షలు జరుపుకునేందుకు వీలుంటుంది. బ్యాక్​లాక్​ విద్యార్థులకు కూడా ఈ విధానం వర్తిస్తుంది.
  • సెప్టెంబర్​ నెలలో జరిగే పరీక్షలకు ఒకటి లేదా రెండు పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులకు.. మరోసారి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి. అయితే 2019-20 విద్యార్థలకు మాత్రం ఈ ఒక్కసారి మాత్రమే అవకాశమివ్వాలి.
  • ఏప్రిల్​లో సూచించినట్లుగా మిగిలిన సెమిస్టర్ విద్యార్థులకు అంతర్గత పరీక్షలు, గత సెమిస్టర్​ పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకొని గ్రేడ్​లు ఇచ్చుకోవచ్చు.

ఇదీ చదవండి:కరోనా కాలంలోనూ అక్కడ పదో తరగతి పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details