ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరం పునాది నమూనాను ఆలయ నిర్మాణ నిపుణుల కమిటీ సిద్ధం చేసింది. ఈ నమూనా వివరాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు నేడు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
నిర్మాణరంగంలో ఖ్యాతిగడించిన నిపుణులు, ఇంజనీర్లతో కలిసిన ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను ట్రస్ట్ ఏర్పాటు చేసింది. వీరు ఆలయానికి సంబంధించిన పునాది, ఇతర నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఈ ప్యానెల్‌కు దిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్ వీ.ఎస్ రాజు నేతృత్వం వహించనున్నారు.