తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా పోరు: రాజకీయాల్లో 'రంగీలా' దారెటు? - ఉద్ధవ్ ఠాక్రే

శివసేనలో చేరతారన్న వార్తలను ఖండించారు సినీ నటి ఊర్మిళ. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టంచేశారు.

మహా పోరు: రాజకీయాల్లో 'రంగీలా' దారెటు?

By

Published : Sep 17, 2019, 6:07 PM IST

Updated : Sep 30, 2019, 11:19 PM IST

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు శివసేనలో చేరతారన్న ఊహాగానాలను తోసిపుచ్చారు సినీ నటి, కాంగ్రెస్​ మాజీ నేత ఊర్మిళా మాతోండ్కర్. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టంచేశారు.

కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చాక... శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిళింద్ నర్వేకర్​తో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు స్పందించారు ఊర్మిళ.

లోక్​సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​లో చేరిన ఊర్మిళ... ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. 6 నెలలకే కాంగ్రెస్​ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీలోని అంతర్గత రాజకీయాలే ఇందుకు కారణమని చెప్పారు.

మహారాష్ట్ర శాసనసభకు వచ్చే నెల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఊర్మిళ రాజకీయ భవిష్యత్ మరోమారు చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి : పటేల్ స్ఫూర్తితోనే కశ్మీర్​పై నిర్ణయం: మోదీ

Last Updated : Sep 30, 2019, 11:19 PM IST

ABOUT THE AUTHOR

...view details