తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూపాయికే ఇడ్లీ.. పేదల కడుపు నింపుతున్న కమలమ్మ - one rupee idly in naramangalam

సాటి మనిషికి ఆకలి తీర్చాలంటే మేడలు, మిద్దెలూ అక్కర్లేదు మంచి మనసుంటే చాలని మరోసారి నిరూపించింది తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. తాటి గుడిసేలో రూపాయికే ఇడ్లీ విక్రయిస్తూ పేదల ఆకలి తీర్చేస్తోంది. డబ్బులో దొరకని ఆత్మసంతృప్తి ఒకరి కడుపు నింపడంలోనే దొరికిందని చెబుతోంది ఆ బామ్మ.

Filling poor stomachs loftier than income earned"- Affection of grandma selling idlis at one rupee in karnataka, tiruvaroor
తాటాకు గుడిసె.. రూపాయికే పేదల ఆకలి తీర్చే!

By

Published : Sep 11, 2020, 2:28 PM IST

తాటాకు గుడిసె.. రూపాయికే పేదల ఆకలి తీర్చే

తమిళనాడులోని తిరువరూర్- నారమంగళం గ్రామానికి చెందిన .. కమల పట్టి (85)కి 50 ఏళ్లుగా హోటలే జీవనాధారం. హోటల్ అంటే మన నగరాల్లో నడిపినట్టుగా రంగురంగుల లైట్లు, టేబుళ్లు, డిజైన్లతో కూడిన ప్లేట్లు ఉండవు. పాండయచూర్ నదీ తీరాన.. ఓ చిన్ని తాటాకు గుడిసె ఆమె హోటల్. వెడల్పాటి పచ్చని ఆకులే ఆ హోటల్ లో ప్లేట్లు. పెద్ద బండరాళ్లే అక్కడ కుర్చీలు, టేబుళ్లు. ఏ హంగూ లేకపోయినా.. ఇతర హోటళ్లకు లేని ప్రత్యేకత కమలమ్మ హోటల్ సొంతం. అదే.. రూపాయికి ఇడ్లీ.

తాటాకు గుడిసె.. రూపాయికే పేదల ఆకలి తీర్చే!

కమలమ్మ హోటల్ లో ఒక్క రూపాయికే ఒక ఇడ్లీ లేదా దోస తినొచ్చు. గ్రామంలోని రైతులు, పేదలు.. ఉదయాన్నే ఓ పది రూపాయలు పట్టుకొచ్చి కడుపు నిండా పది ఇడ్లీలు, దోసలు తిని, పొలం పనులకు పయనమవుతారు. అయితే, కరోనా కాలంలో పెరిగిన ధరలు పట్టించుకోకుండా ఇప్పటికీ రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తోంది కమలమ్మ. ఆదాయం కోసం పాకులాడకుండా, అతి తక్కువ ధరకే పేదల కడుపు నింపుతున్న కమలమ్మకు గ్రామస్థులు సలాం చేస్తున్నారు.

తాటాకు గుడిసె.. రూపాయికే పేదల ఆకలి తీర్చే!

"ఈ బామ్మ 50 ఏళ్లుగా ఇక్కడే రూపాయి ఇడ్లీ, దోస అమ్ముతోంది. నా లాంటి పేదలు కేవలం రూ.10లకే ఆకలి తీర్చుకోవచ్చు. బయట పెద్ద హోటళ్లకు వెళ్తే... ఒక్కో దోసకు రూ.35-రూ.50 చెల్లిస్తాం. కానీ, ఇక్కడ అలా కాదు. "

-పక్కీరి, గ్రామస్థుడు

అయితే, తనకు డబ్బులో లభించని ఆత్మ సంతృప్తి పేదల ఆకలి తీర్చడంలోనే దొరుకుతుందంటోంది కమలమ్మ. అందుకే, రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తానంటోంది.

తాటాకు గుడిసె.. రూపాయికే పేదల ఆకలి తీర్చే!

"మా అమ్మ 50 పైసలకే ఓ దోస/ఇడ్లీ అమ్మి మమ్మల్ని పోషించింది. ఆమె మరణించాక నేను ఈ వ్యాపారం చేపట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీ అమ్ముతున్నాను. ఒకరి ఆకలి తీర్చితే మనసుకు తృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి ఏ సంపాదన వల్ల వస్తుంది?"

-కమల పట్టి

ఇదీ చదవండి:ఒకేసారి నలుగురు బిడ్డలకు తల్లయింది!

ABOUT THE AUTHOR

...view details