సాధించాలన్న తపన.. కష్టపడే తత్వం ఉంటే విజయం మన వశమవ్వక తప్పదని మరోసారి నిరూపించింది మధ్యప్రదేశ్‌కు చెందిన రోషిణి భదౌరియా. ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పంతో ప్రతిరోజు 24 కి.మీ సైకిల్ తొక్కి.. పదో తరగతి పరీక్షల్లో 98.5% మార్కులు సాధించి సత్తా చాటింది.
రోజుకు 24 కి.మీ సైకిల్ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది! నాన్న భుజాల నుంచి సైకిల్ పైకి..
భిండ్ జిల్లా అజ్నోల్కు చెందిన ఓ నిరుపేద రైతు కుటుంబంలో పుట్టింది రోషిణి. తండ్రి పురుషోత్తం భదౌరియా, తల్లి సరిత భౌదరియా ఎంతో కష్టపడి రోషిణిని చదివిస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున ఊరికి 12 కి.మీల దూరంలో ఉన్న మెహ్గావ్ పట్టణంలోని ఓ బడిలో రోషిణిని చేర్చారు.
రోజుకు 24 కి.మీ సైకిల్ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది! ఆ గ్రామానికి కొన్నేళ్ల క్రితం కనీసం సరైన రోడ్డు మార్గం కూడా లేదు. అయినా.. కూతురిని చదివించాలన్న ఒకే ఆశయంతో.. తన భుజాలపై రోషిణిని బడి వరకు మోసుకెళ్లేవాడు పురుషోత్తం. వంతెన నిర్మించాక జిల్లా అధికారులు రోషిణికి ఓ సైకిలిచ్చారు. అప్పటి నుంచి రోజూ ఆ సైకిల్‌పైనే బడికి వెళ్లేది రోషిణి. ఒక్కోసారి భారీ వర్షాల కారణంగా ఇంటికి రాలేకపోతే.. దారిలో తాత ఇంటికి వెళ్లిపోయేది.
రోజూ 24 కి.మీ...
రోజుకు 24 కి.మీ సైకిల్ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది! అలా రోజూ బడికి వెళ్లడానికి 12 కి.మీ, తిరిగి ఇంటికి చేరుకోడానికి 12 కి.మీ మొత్తం 24 కి.మీ సైకిల్ తొక్కిన రోషిణి.. దృఢ సంకల్పంతో పదో తరగతి బోర్డ్ పరీక్షల్లో 98.5% మార్కులు సాధించింది. ఇప్పటివరకు ఆ గ్రామంలో ఎవరికీ దక్కని విజయాన్ని తమ కూతురు సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు రోషిణి తల్లిదండ్రులు.
తన ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను పరీక్షలు బాగా రాశానంటోంది రోషిణి.
రోజుకు 24 కి.మీ సైకిల్ తొక్కి.. విజయాన్ని చేజిక్కించుకుంది! "నాకు చాలా సంతోషంగా ఉంది. నేనెప్పుడూ అనుకోలేదు 98.5% మార్కులు సాధిస్తానని. ఎలాంటి ఒడుదొడుకులొచ్చినా చదువుపై దృష్టి పెట్టాను. పరీక్షలు బాగా రాశాను. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు నన్నెంతో ప్రోత్సహించారు. ఇక నాన్న ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. నేను బాగా చదివి ఐఏఎస్ అధికారి అవ్వాలన్నది నా కల. ఇంటర్ పూర్తి చేశాక ఆ వైపుగా శిక్షణ తీసుకుంటా. "
-రోషిణి భదౌరియా
ఇదీ చదవండి: యువత మేలుకో.. పొదుపు మార్గం ఎంచుకో